sourav ganguly: గంగూలీ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంది: ఉడ్ ల్యాండ్స్ ఆసుప‌త్రి డాక్టర్లు

Medical board of 9 members will meet today
  • కాసేప‌ట్లో తొమ్మిది మంది స‌భ్యుల మెడికల్ బోర్డు స‌మావేశం
  • గంగూలీకి త‌దుపరి చికిత్స అంశంపై చ‌ర్చ‌
  • అనంత‌రం చికిత్స ప్ర‌ణాళిక‌పై ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తోనూ చ‌ర్చ‌
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయనకు కోల్ కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ప్రస్తుతం ఆయ‌న‌ ఆరోగ్యం నిలకడగా ఉందని ఉడ్ ల్యాండ్స్ ఆసుప‌త్రి డాక్టర్లు తెలిపారు.

కాసేప‌ట్లో తొమ్మిది మంది స‌భ్యుల మెడికల్ బోర్డు స‌మావేశం అవుతుంద‌ని, గంగూలీకి త‌దుపరి చికిత్స అంశంపై వారు చర్చిస్తార‌ని చె‌ప్పారు. అనంత‌రం గంగూలీకి అందించాల్సిన చికిత్స ప్ర‌ణాళిక‌పై ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తోనూ చ‌ర్చిస్తార‌ని వివ‌రించారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని తాము నిరంత‌రం పర్య‌వేక్షిస్తున్నామ‌ని తెలిపారు.
sourav ganguly
Cricket
kolkata
West Bengal

More Telugu News