Washington Post: 'నాకు ఓటేసేవారిని చూడండి... లేకుంటే రిస్క్ లో పడతారు'... అధికారిని బెదిరిస్తున్న ట్రంప్ ఆడియో!

Trump Warning to Election Officer Audio Tapes Leak
  • బయటపెట్టిన 'వాషింగ్టన్ పోస్ట్' 
  • జార్జియా సెక్రెటరీకి ఫోన్ చేసిన ట్రంప్
  • ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ట్రంప్
  • తీవ్రంగా ఖండించిన డెమోక్రాట్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్ అధికారులను బెదిరిస్తున్నట్టుగా వినిపిస్తున్న ఓ ఆడియో టేప్, ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. తనకు ఓట్లు వేసేవారిని చూడకుంటే, చాలా పెద్ద రిస్క్ లో పడతారని సహచర రిపబ్లికన్ బ్రాడ్ రాఫెన్ స్ప్రిగర్, జార్జియా అధికారిని ట్రంప్ హెచ్చరించారు. రహస్యంగా రికార్డు చేసిన ఈ ఆడియోను తొలుత 'వాషింగ్టన్ పోస్ట్' బయటపెట్టింది. తన మాట వినకుంటే నష్టం తప్పదని కూడా ఆయన హెచ్చరించారు.

జార్జియాలో జో బైడెన్ విజయం దిశగా వెళుతున్న వేళ, ఆయన జార్జియా సెక్రెటరీకి ఫోన్ చేశారు. బైడెన్ ను అధిగమించేందుకు అవసరమైనన్ని ఓట్లు తనకు వచ్చేలా చూడాలని ఆదేశించారు. "జార్జియా ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. దేశంలోని ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారు. నేను ఈ మాటనడంలో తప్పు లేదు. మనం లక్షల ఓట్ల వెనకున్నాం" అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఆపై రాఫెన్ స్ప్రిగర్ స్పందిస్తూ, "మిస్టర్ ప్రెసిడెంట్ మనకందుతున్న సమాచారం తప్పుడు సమాచారం. అదే మన ముందున్న పెద్ద సవాలు" అని అన్నారు. దీర్ఘకాలంగా రిపబ్లికన్ల తరఫున నిలుస్తూ వచ్చిన జార్జియాలో బైడెన్ 12 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సంగతి విదితమే. రీకౌంట్, రీ ఆడిట్ తరువాత కూడా ఫలితం మారలేదు. ఈ విషయంలో ట్రంప్ కోర్టును ఆశ్రయించినా, నిరాశే ఎదురైంది.

ఈ ఆడియో టేపులు సంచలనం కలిగిస్తున్న వేళ, తన సామాజిక మాధ్యమాల ద్వారా ట్రంప్ స్పందించారు. "రాఫెన్ స్ప్రిగర్ నా ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. ఓట్ల కుంభకోణం జరిగినా అడ్డుకోలేకపోయారు. పక్క రాష్ట్రాల ఓట్లు, చనిపోయిన వారి ఓట్లను వేస్తున్నా పసిగట్టలేదు" అని ఆరోపించారు. ఇక ట్రంప్ కామెంట్లపై స్పందించేందుకు శ్వేతసౌధం అధికారులు నిరాకరించారు. ట్రంప్ ఇలా ఫోన్ చేసి మాట్లాడటాన్ని డెమొక్రాట్ నేతలు మాత్రం తీవ్రంగా ఖండించారు.
Washington Post
Donald Trump
Risk
Elections
Audio Tapes
Leaked

More Telugu News