BCCI: టీ20 వరల్డ్ కప్ నిర్వహించనున్న బీసీసీఐ.... ఆందోళనకు గురిచేస్తున్న పన్నుల భారం!

  • ఈ ఏడాది భారత్ లో టీ20 వరల్డ్ కప్
  • పన్ను మినహాయింపు కోసం కేంద్రానికి దరఖాస్తు చేసుకున్న బీసీసీఐ
  • పూర్తి పన్ను మినహాయింపు ఇవ్వకపోతే బీసీసీఐపై భారం
  • రూ.906 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి!
BCCI awaits for Centre nod on tax exemption

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నిర్వహించాలని భావిస్తోంది. అయితే, ఈ టోర్నీ ద్వారా బీసీసీఐ లాభాలు ఆర్జించే విషయం కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంది. ఎందుకంటే, ఈ టోర్నీకి కేంద్రం గనుక పూర్తిస్థాయిలో పన్ను మినహాయింపు ఇవ్వనట్టయితే... బీసీసీఐ పన్నుల రూపేణా రూ.906 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కేంద్రం పాక్షికంగా పన్ను మినహాయింపు ఇచ్చినా బీసీసీఐ రూ.227 కోట్ల వరకు చెల్లించక తప్పదు.

ఈ టీ20 వరల్డ్ కప్ ను భారత్ గనుక నిర్వహించలేకపోతే, ప్రత్యామ్నాయ వేదికగా యూఏఈని ఐసీసీ సిద్ధం చేస్తోంది. ఈ టోర్నీ నిర్వహణను బీసీసీఐ ఇప్పటికే రెండు పర్యాయాలు వాయిదా వేసింది. ఈసారి వాయిదా వేసే పరిస్థితులు లేని నేపథ్యంలో బీసీసీఐపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే రెండు డెడ్ లైన్లు దాటి వచ్చిన బీసీసీఐకి తాజాగా ఐసీసీ ఫిబ్రవరి వరకు గడువు విధించింది. ఈలోపు బోర్డు తన నిర్ణయం వెలువరించాల్సి ఉంటుంది. టీ20 వరల్డ్ కప్ కు పూర్తిస్థాయిలో పన్ను మినహాయింపు ఇవ్వాలంటూ బీసీసీఐ కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. బీసీసీఐ దరఖాస్తుపై కేంద్రం ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదు.

More Telugu News