SP Rajakumari: రామతీర్థంలో విజయసాయిరెడ్డిపై జరిగిన దాడి ఘటనలో కేసు నమోదు చేశాం: ఎస్పీ రాజకుమారి

  • రామతీర్థం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్న ఎస్పీ
  • 12 మందిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడి
  • కేసు దర్యాప్తులో రాజకీయ ప్రమేయం లేదని స్పష్టీకరణ
  • బాధ్యులను తప్పకుండా శిక్షిస్తామని ఉద్ఘాటన
SP Rajakumari says case files on attack over Vijayasai Reddy

విజయనగరం జిల్లా రామతీర్థంలో విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ రాజకుమారి వెల్లడించారు. సాంకేతిక, భౌతిక ఆధారాల కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే దేవస్థానం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 12 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కేసు దర్యాప్తులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ఘటనకు బాధ్యులు ఎంతటివారైనా శిక్ష తప్పదని అన్నారు.

ఎంపీ విజయసాయిరెడ్డిపై జరిగిన దాడి ఘటనలోనూ కేసు నమోదు చేశామని వివరించారు. ఇవాళ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ రామతీర్థంలో పర్యటించిన సందర్భంగా ఎస్పీ రాజకుమారి కూడా అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

More Telugu News