ఏపీ కరోనా అప్ డేట్: 232 కొత్త కేసులు, 4 మరణాలు

03-01-2021 Sun 18:50
  • గత 24 గంటల్లో 40,177 కరోనా టెస్టులు
  • అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 56 కేసులు
  • అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3 కేసులు
  • యాక్టివ్ కేసుల సంఖ్య 3,070
AP Covid updates

ఏపీలో గడచిన 24 గంటల్లో 40,177 కరోనా పరీక్షలు నిర్వహించారు. వాటిలో 31,981 టెస్టులను వీఆర్డీఎల్, ట్రూనాట్, నాకో విధానంలో నిర్వహించగా.... 8,196 రాపిడ్ యాంటీజెన్ టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 232 మందికి కరోపా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 56 కొత్త కేసులు వెల్లడయ్యాయి. కృష్ణా జిల్లాలో 40, పశ్చిమ గోదావరి జిల్లాలో 31, గుంటూరు జిల్లాలో 27 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 4, కడప జిల్లాలో 4, శ్రీకాకుళం జిల్లాలో 5, నెల్లూరు జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 352 మంది కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,83,082 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,72,897 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 3,070 మందికి చికిత్స కొనసాగుతోంది. ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 7,115కి చేరింది.