తాను పార్టీ పెడుతున్నట్టు ఫ్లెక్సీలు.. ముద్రగడ సీరియస్

03-01-2021 Sun 10:40
  • కాపు ఉద్యమం నుంచి ఇటీవలే తప్పుకున్న ముద్రగడ
  • ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కిర్లంపూడిలో ఫిర్యాదు
  • కాకినాడలో ఫిర్యాదు చేయాలన్న పోలీసులు
is mudragada padmanabham ready to Formation a political party
కాపు ఉద్యమం నుంచి ఇటీవల తప్పుకున్న ముద్రగడ పద్మనాభం రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ కాకినాడలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. విషయం తెలిసిన ముద్రగడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గౌరవానికి భంగం కలిగించేందుకు కొందరు పనిగట్టుకుని ఈ పని చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  అయితే, ఇది కాకినాడకు సంబంధించిన విషయం కావడంతో అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు ఆయనకు సూచించినట్టు సమాచారం.