ఆన్‌లైన్ మనీయాప్‌కు మరొకరు బలి.. స్నేహితులకు మెసేజ్‌లతో మనస్తాపంతో ఉరి

03-01-2021 Sun 08:31
  • రుణ యాప్‌ల వేధింపులకు ఇప్పటికే ముగ్గురు బలి
  • మేడ్చల్ జిల్లాలో తాజాగా మరొకరు
  • యాప్ నిర్వాహకులు వేధిస్తున్నారంటూ గత నెలలో ఫిర్యాదు
Man suicide after taken loan from online money app
ఆన్‌లైన్ మనీ యాప్‌కు మరొకరు బలయ్యారు. యాప్ నిర్వాహకుల వేధింపులకు తెలంగాణలో ఇప్పటికే ముగ్గురు బలికాగా, తాజాగా మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. మేడ్చల్ జిల్లాలోని గుండ్లపోచంపల్లికి చెందిన చంద్రమోహన్ ఆన్‌లైన్ మనీ యాప్‌లో కొంత మొత్తాన్ని తీసుకున్నాడు.

ఆ తర్వాత ఇబ్బందుల కారణంగా సకాలంలో డబ్బులు చెల్లించలేకపోవడంతో చంద్రమోహన్‌ ఫోన్‌లోని కాంటాక్ట్ నంబర్లకు ఆ విషయం చెబుతూ యాప్ నిర్వాహకులు మెసేజ్‌లు పంపించారు. ఈ విషయం తెలిసిన చంద్రమోహన్ మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కాగా, యాప్ నిర్వాహకులు తనను వేధిస్తున్నట్టు చంద్రమోహన్ గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.