Subrahmanya Swamy: ఇండియన్స్ అంటే పందులా?... వ్యాక్సిన్ పై సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు!

  • కోవిషీల్డ్ కు అనుమతించిన నిపుణుల కమిటీ
  • ఇంకా అత్యవసర వినియోగానికి అనుమతించని డబ్ల్యూహెచ్ఓ
  • భారతీయులను వాడుకుంటున్నారన్న స్వామి
Are Indians Are Guniya Pigs asked by BJP MP Subrahmanya Swamy

ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ కు ఇండియాలో అనుమతి ఇవ్వడాన్ని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాక్సిన్ ను అత్యవసరంగా వినియోగించుకునేందుకు కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంతవరకూ అనుమతించలేదని గుర్తు చేసిన ఆయన, వ్యాక్సిన్ ప్రయోగాలకు భారతీయులను వాడుకుంటున్నారని ఆరోపించారు.

దేశంలోని పౌరులు గినియా పందుల్లా మారిపోనున్నారా? అంటూ తన ట్విట్టర్ లో ప్రశ్నించారు. ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ను ఇండియాలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుండగా, ఎమర్జెన్సీ యూసేజ్ కోసం నిపుణుల కమిటీ అనుమతించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ట్విట్టరాటీలు, దేశవాళీ టీకా గురించి ప్రశ్నించడం ప్రారంభించారు. స్వదేశీ శాస్త్రవేత్తల సామర్థ్యాన్ని తప్పుబడుతున్నారా? అంటూ ప్రశ్నించారు.

ఇక ఈ వ్యాక్సిన్ బీజేపీ వ్యాక్సిన్ అంటూ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను వ్యాక్సిన్ తీసుకోబోనని అన్నారు.ఇదిలావుండగా, మోడెర్నా తయారుచేసిన వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగానికి అనుమతిస్తున్నామని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో విజయవంతంగా పనిచేస్తున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పై ఎన్నో పేద దేశాలు ఆశలు పెంచుకుంటున్న వేళ, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఇంకా అనుమతి ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News