Vellampalli Srinivasa Rao: జగన్ కు సవాలు విసిరే స్థాయి లోకేశ్ కు ఉందా?: ఏపీ దేవాదాయ మంత్రి వెల్లంపల్లి

Nara Lokesh doesnt have status to criticise Jagar says Vellampalli
  • సీఎంగా ఉన్నప్పుడు దేవాలయాలను కూల్చిన ఘనత చంద్రబాబుది
  • జగన్ కు మంచి పేరు వస్తోందని కుట్రలకు పాల్పడుతున్నారు
  • వచ్చే ఎన్నికలలో తండ్రి, కొడుకులకు డిపాజిట్లు కూడా రావు

టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ లపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  దేవాలయాలను కూల్చిన ఘనత చంద్రబాబుదని చెప్పారు. బూట్లు వేసుకుని భూమి పూజ చేసిన చరిత్ర ఆయనదని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి జగన్ కు మంచి పేరు వస్తుందనే ఈర్ష్యతో చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తిరుమలలో వెయ్యి స్తంభాల మండపాన్ని కూల్చిన చంద్రబాబు... ఇప్పుడు రామతీర్థంకు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారని చెప్పారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు.

మతాల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని వెల్లంపల్లి ఆరోపించారు. చంద్రబాబును తాము మనిషిగానే చూడటం లేదని అన్నారు. చంద్రబాబు జీవితంలో అసెంబ్లీలో అడుగు పెట్టలేరని... కుప్పంలో కూడా ఆయన ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికలలో తండ్రి, కొడుకులకు డిపాజిట్లు కూడా రావని అన్నారు. కార్పొరేటర్ గా కూడా గెలవలేని నారా లోకేశ్ కు జగన్ ని సవాల్ చేసే స్థాయి లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News