Jeevan Reddy: రాజగోపాల్ రెడ్డి గెలిచింది కాంగ్రెస్ గుర్తుపై... ఆయన సొంత గెలుపు కాదు: జీవన్ రెడ్డి

Jeevan Reddy fires on Komatireddy Rajagopal Reddy
  • బీజేపీలో చేరతానని వెల్లడించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న జీవన్ రెడ్డి
  • మళ్లీ పోటీ చేసి గెలవాలని సవాల్
  • స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటున్నారని ఆగ్రహం
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతానని ప్రకటించిన నేపథ్యంలో హస్తం పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొందరు నేతలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్నారని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి గెలిచింది కాంగ్రెస్ గుర్తుపై అని, అది ఆయన వ్యక్తిగత గెలుపు కాదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ వీడాలనుకుంటే ముందు పదవికి రాజీనామా చేయాలని నిర్మొహమాటంగా చెప్పారు. ఒకవేళ సొంతబలంతో గెలిచాడని భావిస్తే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. రాజగోపాల్ రెడ్డి బెదిరింపు రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు.
Jeevan Reddy
Komatireddy Raj Gopal Reddy
Congress
BJP

More Telugu News