Nara Lokesh: మరోసారి సవాల్ చేస్తున్నా... అప్పన్న సన్నిధిలో ప్రమాణానికి నేను సిద్ధం... జగన్ సిద్ధమా?: నారా లోకేశ్

Nara Lokesh challenges again CM Jagan
  • ఇప్పటికే ఓసారి సీఎం జగన్ కు సవాల్ విసిరిన లోకేశ్
  • లోకేశ్ సవాల్ ను స్వీకరించిన విజయసాయి
  • చర్చకు వస్తానంటూ ప్రకటన 
  • 840 మొరుగుతోంది ఏంటన్న లోకేశ్
  • తోకముడిచి పారిపోతున్నారంటూ వ్యాఖ్యలు
తనపై వస్తున్న ఆరోపణలపై సింహాద్రి అప్పన్న ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా అంటూ నారా లోకేశ్ సీఎం జగన్ కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే, లోకేశ్ సవాల్ ను తాను స్వీకరిస్తున్నట్టు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. తాను చర్చకు సిద్ధమేనని, మరి లోకేశ్ వస్తాడా? అంటూ సవాల్ విసిరారు. దీనిపై నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. నేను 420 జగన్ రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది ఏంటి అని బదులిచ్చారు. ఏ1కి దమ్మూ ధైర్యం లేదా? అని ప్రశ్నించారు.

దైవం మీద ప్రమాణం అనగానే తోకముడిచి చర్చ అంటూ పారిపోతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. తనపై వైసీపీ చేసే ఆరోపణల్లో బురద రాజకీయం తప్ప నిజంలేదని ఇక్కడే తేలిపోయిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మరోసారి సవాల్ చేస్తున్నానని, తనపై జగన్ రెడ్డి చేస్తున్న, చేయిస్తున్న ఆరోపణలు అవాస్తవం అని సింహాద్రి అప్పనపై ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, మరి జగన్ సిద్ధమా? అంటూ ట్వీట్ చేశారు.
Nara Lokesh
Jagan
Vijay Sai Reddy
Challenge
Andhra Pradesh

More Telugu News