Botsa Satyanarayana: ప్రచారం కోసం చంద్రబాబు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు: బొత్స విమర్శలు

Botsa comments on Chandrababu over Ramatheertham issue
  • చంద్రబాబు రామతీర్థం పర్యటన
  • ఇప్పటివరకు టీడీపీ నేతలు ఎందుకు రాలేదన్న బొత్స
  • చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని విమర్శలు
  • కుట్రపూరితంగా ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపణలు
రామతీర్థం ఘటన, రాజకీయ రగడ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రతిదీ రాజకీయం చేస్తూ రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఘటన జరిగి ఇన్నిరోజులు గడిచినా ఇప్పటివరకు టీడీపీ నేతలను ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. స్థానికుడైన అశోక్ గజపతిరాజు ఎందుకు సందర్శించలేదని నిలదీశారు.

చంద్రబాబు ప్రయత్నాలన్నీ పబ్లిసిటీ కోసమేనని, ప్రచారం కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని విమర్శించారు. రామతీర్థంలో జరిగిన ఘటన ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం తప్ప, ఏ వ్యక్తికో, ఏ పార్టీకో సంబంధించిన అంశం కాదని బొత్స స్పష్టం చేశారు. సరిగా, డిసెంబరు 30న సీఎం జగన్ విజయనగరం వస్తున్నారని తెలిసి ఈ ఘటనకు పాల్పడినట్టు అర్థమవుతోందని, ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడానికి ఈ కుట్ర చేసినట్టు భావిస్తున్నామని అభిప్రాయపడ్డారు.
Botsa Satyanarayana
Chandrababu
Ramatheertham
Idol Vandalizing
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News