SS Thaman: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అంకితం ఇచ్చిన తమన్

SS Thaman dedicates his Dada Saheb Phalke award to Trivikram Srinivas
  • తమన్, త్రివిక్రమ్ కాంబోలో అల వైకుంఠపురములో
  • బ్లాక్ బస్టర్ హిట్ అయిన పాటలు
  • తమన్ కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు
  • త్రివిక్రమ్ సహకారం వల్లే అర్హుడ్నయ్యానన్న తమన్ 
టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్.తమన్ కు ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే (సౌత్) అవార్డుల్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో తమన్ స్వరపరిచిన అనేక చిత్రాల గీతాలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన 'అల వైకుంఠపురములో' పాటలు తమన్ కెరీర్ లో చిరస్మరణీయం అని చెప్పొచ్చు. ఆ సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అయింది. అందుకే, తనకు లభించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును తమన్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించాడు.

త్రివిక్రమ్ సహకారం లేకుండా తాను ఇంతటి ఘనతకు అర్హుడ్ని కానని తమన్ వినమ్రంగా తెలిపాడు. అందుకే హృదయపూర్వకంగా త్రివిక్రమ్ కు ఈ అవార్డును అంకితమిస్తున్నానని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ కు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పాడు. అంతేకాదు, హారిక హాసినీ, గీతా ఆర్ట్స్ సంస్థలకు, అల్లు అరవింద్, రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు అంటూ తమన్ ట్వీట్ చేశాడు.
SS Thaman
Trivikram Srinivas
Dada Sageb Phalke Award
Best Music Director
Ala Vaikunthapuramulo
Tollywood

More Telugu News