Telangana: ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. నాగర్‌కర్నూలు యువతి మృతి

Nagarkurnool girl killed in a road accident in Australia
  • ఏడాది క్రితం ఆస్ట్రేలియా వెళ్లిన రక్షిత
  • సిడ్నీలోని ఐఐబీఐటీ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్న యువతి
  • మృతదేహాన్ని స్వదేశం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు
తెలంగాణలోని నాగర్‌కర్నూలుకు చెందిన యువతి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జిల్లాలోని వంగూరు మండలం దిండిచింతపల్లికి చెందిన రక్షిత (22) ఉన్నత విద్య అభ్యసించేందుకు ఏడాది క్రితం ఆస్ట్రేలియా వెళ్లింది. సిడ్నీలోని ఐఐబీఐటీ యూనివర్సిటీలో చేరి ఎంఎస్ చదువుతోంది. గురువారం బైక్‌పై వెళ్తున్న ఆమె రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. రక్షిత తండ్రి వెంకట్‌ రెడ్డి ఆర్మీలో పనిచేసి స్వచ్ఛందంగా రిటైరయ్యారు. ప్రస్తుతం డీఆర్‌డీఏలో ఉద్యోగం చేస్తున్నారు. రక్షిత మృతదేహాన్ని స్వదేశం తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Telangana
Nagarkurnool District
Australia
Road Accident

More Telugu News