Katta Venkata Narasaiah: మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నరసయ్య కన్నుమూత

Madhira Ex MLA Katta Venkata Narasaiah passes away
  • మధిర నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2009లో పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా
  • రాజకీయ ప్రముఖుల సంతాపం
ఖమ్మం జిల్లా మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నరసయ్య కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, స్వగ్రామమైన కల్లూరు మండలం పోచారంలోని తన నివాసంలో గత రాత్రి తుదిశ్వాస విడిచారు. మధిర నియోజకవర్గం నుంచి సీపీఎం తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీ అధిష్ఠానం తీరుపై అసంతృప్తితో 2009లో పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన ఆయన ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. వెంకట నరసయ్య మృతికి సీపీఎం నాయకులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Katta Venkata Narasaiah
Khammam District
Madhira

More Telugu News