Reliance: షేర్ల ట్రేడింగులో అవకతవకలు.. రిలయన్స్, ముకేశ్ అంబానీకి రూ. 40 కోట్ల జరిమానా!

  • మరో రెండు సంస్థలకు కలిపి రూ. 30 కోట్ల జరిమానా
  • వాటాలు విక్రయిస్తూ షేర్ల ధర పడిపోకుండా ఉండేందుకు ప్రణాళిక
  • తొలుత ఫ్యూచర్ మార్కెట్లో, ఆ తర్వాత స్పాట్ మార్కెట్లో విక్రయం
Sebi slaps fine on Reliance and Ambani

షేర్ల ట్రేడింగులో అవకతవకలకు సంబంధించిన కేసులో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కు రూ.25 కోట్లు, దాని అధినేత ముకేశ్ అంబానీకి రూ.15 కోట్లు చొప్పున మొత్తం రూ.40 కోట్లు జరిమానా విధించింది. అలాగే, మరో రెండు సంస్థలు నవీ ముంబై సెజ్ ప్రైవేటు లిమిటెడ్, ముంబై సెజ్ లిమిటెడ్‌లకు వరుసగా రూ. 20 కోట్లు, రూ. 10 కోట్ల జరిమానాలు విధించింది. నవంబరు 2007లో రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ (ఆర్‌పీఎల్) షేర్ల ట్రేడింగులో అవకతవకలకు సంబంధించిన కేసులో సెబీ ఈ  జరిమానాలు విధించింది.

మార్చి 2007లో రిలయన్స్ ఇండస్ట్రీస్.. రిలయన్స్ పెట్రోలియంలోని 4.1 శాతం వాటాను విక్రయించింది. అయితే, ఆర్‌పీఎల్ షేర్ల ధర పడిపోకుండా ఉండేందుకు ప్రణాళిక ప్రకారం తొలుత ఫ్యూచర్ మార్కెట్లో విక్రయించి, ఆ తర్వాత స్పాట్ మార్కెట్లో విక్రయించింది. ఆర్ఐఎల్‌కు సీఎండీగా ఉన్న ముకేశ్ అంబానీ దాని రోజు వారీ వ్యవహారాలకు బాధ్యత వహిస్తున్నారని, కాబట్టి ఆర్ఐఎల్ చేసిన మానిప్యులేటెడ్ ట్రేడింగ్‌కు కూడా ఆయనదే బాధ్యత అని సెబీ స్పష్టం చేసింది. రిలయన్స్ పెట్రోలియంలో తన వాటా షేర్ల విక్రయానికి సంబంధించి లావాదేవీల ట్రేడింగ్‌లో ఆర్ఐఎల్‌ అవకతవకలకు పాల్పడిందని  సెబీ అడ్జుడికేటింగ్‌ ఆఫీసర్‌ బీజే దిలీప్‌ తెలిపారు.

More Telugu News