గుణశేఖర్ 'శాకుంతలం' నాయికగా సమంత.. అధికారిక ప్రకటన!
- గుణశేఖర్ దర్శకత్వంలో దృశ్య కావ్యం 'శాకుంతలం'
- కథానాయిక పాత్ర విషయంలో రకరకాల పేర్లు ప్రచారం
- సమంతను ఎంపిక చేసినట్టు గుణ టీమ్ వర్క్స్ వెల్లడి
కాళిదాసు విరచిత శాకుంతలం కావ్యాన్ని గుణశేఖర్ తెరకెక్కిస్తున్నట్టు ఇటీవల ప్రకటించగానే, ఇందులో శకుంతలాగా నటించే అందాలభామ విషయమై రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. చివరికి ఆ అందమైన పాత్రను పోషించే అవకాశం అక్కినేని వారి కోడలు సమంతకు దక్కింది. ఇందుకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను కూడా ఈ రోజు విడుదల చేశారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తారు.
ఇటీవలి కాలంలో 'ఆహా' ఓటీటీ సంస్థకు 'సామ్ జామ్' ప్రోగ్రాం చేస్తూ సమంత బిజీగా వుంది. అలాగే, తమిళంలో నయనతారతో కలసి ఒక సినిమా చేస్తోంది. మరోపక్క, 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సీరీస్ లో కథానాయికగా నటిస్తోంది.