Vijay Sai Reddy: రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం వెనుక కుట్ర దాగివుంది: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy says conspiracy behind idols vandalizing in state to malign CM Jagan reputation
  • ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం
  • రాజకీయ దుమారం రేపిన ఘటనలు
  • జగన్ ప్రతిష్ఠ దెబ్బతీసేందుకేనన్న విజయసాయి
  • తమది లౌకికవాద ప్రభుత్వమని ఉద్ఘాటన
  • కుట్రదారులు తప్పించుకోలేరని వ్యాఖ్యలు
ఏపీలో కొన్నిరోజుల వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు జరగడం రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ పరస్పరం విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా, మధ్యలో బీజేపీ నేతలు సైతం స్పందిస్తున్నారు. విగ్రహాలు ధ్వంసం చేస్తున్నది  ఎవరన్నది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.

సీఎం జగన్ పేరుప్రతిష్ఠలను మసకబార్చే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే విగ్రహాల ధ్వంసం, ప్రతిమలను ఎత్తుకెళ్లడం వంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. లౌకికవాద భావనను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో పనిచేస్తోందని విజయసాయి ఉద్ఘాటించారు. కుట్రదారులు ఇంకెంతో కాలం పరదాల చాటున దాగివుండలేరని హెచ్చరించారు.
Vijay Sai Reddy
Conspiracy
Idols Vandalizing
Jagan
Andhra Pradesh

More Telugu News