UK: యూకేకి విమాన ప్రయాణాలపై కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం

flights between India and UK will resume from 8th January
  • జనవరి 8 నుంచి విమాన సర్వీసులు పునఃప్రారంభం
  • 23 వరకు వారానికి 15 ఫ్లైట్స్ కి అనుమతి
  • ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి మాత్రమే రాకపోకలు

కరోనా కొత్త స్ట్రెయిన్ కారణంగా యూకే నుంచి రాకపోకలను పలు దేశాలు నిషేధించిన సంగతి తెలిసిందే. భారత్ కూడా యూకే నుంచి విమాన రాకపోకలపై బ్యాన్ విధించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 8 నుంచి యూకే, ఇండియాల మధ్య విమాన రాకపోకలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని భారత పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. అయితే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి మాత్రమే రాకపోకలు ఉంటాయని చెప్పారు. జనవరి 23 వరకు వారానికి 15 ఫ్లైట్స్ ను మాత్రమే అనుమతించనున్నారు.

  • Loading...

More Telugu News