సోము వీర్రాజు సీఎం జగన్ కు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మాట్లాడుతున్నారు: వర్ల రామయ్య

01-01-2021 Fri 19:30
  • రాష్ట్రంలో కొనసాగుతున్న విగ్రహాల ధ్వంసం
  • హోంమంత్రి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్న సోము వీర్రాజు
  • చర్యలు తీసుకునేది ఎవరంటూ ప్రశ్నించిన వర్ల
  •  పాపం హోంమంత్రిని అడుగుతారా? అంటూ వ్యాఖ్యలు
Varla Ramaiah questions Somu Veerraju comments on idols vandalizing
రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం జరుగుతుంటే హోంమంత్రి సుచరిత ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని, దీన్నిబట్టే జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో నేత వర్ల రామయ్య స్పందించారు. బీజేపీ అధ్యక్షుడు వీర్రాజు గారు సీఎం జగన్ కు ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓవైపు దేవాలయాలపై దాడులు జరుగుతుంటే చర్యలు తీసుకునేది ఎవరు? ఈ అంశంలో ముఖ్యమంత్రిని ప్రశ్నించకుండా, పాపం హోంమంత్రిని అడగడం చూస్తుంటే ముఖ్యమంత్రి పట్ల ఆయన ఉదారంగా ఉన్నారని అర్థమవుతోంది... అవునా? అంటూ ప్రశ్నించారు.