స్మిత్ భార్య‌కు దూరంగా ఉంటున్నాడు.. అందుకే ఇబ్బందులు: ఆస్ట్రేలియా మాజీ సారథి కిమ్‌ హ్యూస్

01-01-2021 Fri 13:28
  • అత‌డు ప్రపంచస్థాయి ఆటగాడు
  • తాజా సిరీసులో మాత్రం అలా కనిపించడం లేదు
  • కొవిడ్‌ ఆంక్షల వల్ల క్వారంటైన్‌లో గడుపుతున్నాడు
kim on smith performance

భార‌త్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ లో ఆసీస్ ఆట‌గాడు స్టీవ్‌స్మిత్‌ వరుసగా విఫలమవుతున్న విష‌యంపై ఆస్ట్రేలియా మాజీ సారథి కిమ్‌ హ్యూస్ స్పందించాడు. అత‌డు ప్రపంచస్థాయి ఆటగాడని, తాజా సిరీసులో మాత్రం అలా కనిపించడం లేదని చెప్పాడు. 4 నెలలుగా తన భార్య‌ డానీకి కిమ్ హ్యూస్ దూరంగా ఉంటున్నాడని తెలిపాడు. కొవిడ్‌ ఆంక్షల వల్ల క్వారంటైన్‌లో గడుపుతున్నాడని చెప్పాడు.

తన భార్య‌కు దూరంగా ఉండటంతోనే స్మిత్‌ మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని, అందుకే రాణించ‌డం లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.  మూడో టెస్టులోనైనా అతడు బాగా ఆడాలని ఆశిస్తున్నానని తెలిపాడు. అత‌డే‌ కాసేపు క్రీజులో నిలిస్తే చాలు పరుగులు చేస్తాడ‌ని అన్నాడు. మెల్‌బోర్న్‌ టెస్టులో ఆసీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవడం త‌న‌ను షాక్ కు గురి చేసింద‌ని తెలిపాడు. సిరీసులో 2-0తో ఉండే సువర్ణావకాశం చేజారిందని ఆయ‌న చెప్పాడు. టీమిండియాలో రహానె కీల‌క పాత్ర‌ పోషించాడ‌ని తెలిపాడు. ఫీల్డర్లను మోహరించడంలోనూ స‌మ‌ర్థంగా వ్య‌వ‌హ‌రించాడ‌ని చెప్పాడు.