krack: రవితేజ 'క్రాక్' సినిమా ట్రైల‌ర్ విడుద‌ల‌

krack trailer releases
  • గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్'
  • ట్రైలర్‌ ఆరంభంలో విక్టరీ వెంకటేశ్‌ వాయిస్‌ ఓవర్
  • పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ర‌వితేజ‌
రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న 'క్రాక్' చిత్రం ట్రైలర్ విడుదలయింది. తనదైన శైలిలో ర‌వితేజ చెబుతోన్న డైలాగులు అల‌రిస్తున్నాయి. 'శంకర్‌. పోతురాజు వీరశంకర్‌, ఒంగోలు నడి సెంటర్‌లో నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాల్లో సీసం పోస్తా' అంటూ మాస్ డైలాగుతో ర‌వితేజ అల‌రిస్తున్నాడు.

ట్రైలర్‌ ఆరంభంలో విక్టరీ వెంకటేశ్‌ వాయిస్‌ ఓవర్ ను వినొచ్చు. రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనపడుతున్నాడు. వరలక్ష్మీ శరత్‌కుమార్ విలన్ పాత్రలో న‌టించింది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు.

krack
Raviteja
trailer

More Telugu News