BJP: ప్రమాణ స్వీకారం చేయకుండానే మృతి చెందిన బీజేపీ కొత్త కార్పొరేటర్

BJP Corporator who won recent elections died with corona
  • ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం
  • కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరిక
  • చికిత్స పొందుతూనే కన్నుమూత
ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ తరపున విజయం సాధించిన కార్పొరేటర్ ఒకరు నిన్న మృతి చెందారు. లింగోజీగూడకు చెందిన ఆకుల రమేశ్ గౌడ్ బీజేపీ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత మూడు రోజులకే కరోనా బారినపడిన రమేశ్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో నిన్న తుదిశ్వాస విడిచారు.

కార్పొరేటర్‌గా ఎన్నికైనా ఇంకా ప్రమాణస్వీకారం చేయకుండానే మృతి చెందడం విషాదం నింపింది. విషయం తెలిసిన బీజేపీ నేతలు రమేశ్ గౌడ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా, రమేశ్ గౌడ్ గతంలో ఎల్బీనగర్ మున్సిపల్ చైర్మన్‌గానూ పనిచేశారు. 2009 శాసనసభ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
BJP
Hyderabad
GHMC Elections
corporator
Corona Virus

More Telugu News