ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు చంద్రబాబు లేఖ

31-12-2020 Thu 21:40
  • ఏపీలో అధికార యంత్రాంగం వైఫల్యంపై చంద్రబాబు ఆగ్రహం
  • వైసీపీ హయాంలో వేధింపులు పెరిగాయని వెల్లడి
  • విపక్ష నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపణ
  • న్యాయాన్ని నిలబెట్టాలని గవర్నర్ కు విజ్ఞప్తి
Chandrababu writes governor Biswabhushan Harichandan

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. ఏపీలో అధికార యంత్రాంగం వైఫల్యంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో హత్యలు, అత్యాచారాలు, వేధింపులు పెరిగిపోయాయని ఆరోపించారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడికి పాల్పడ్డారని వివరించారు.

ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం వేధిస్తోందనడానికి ఇదే నిదర్శనం అని తెలిపారు. దాడికి పాల్పడ్డవారిని శిక్షించి న్యాయాన్ని నిలబెట్టాలని చంద్రబాబు గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. కొందరు పోలీసులు వైసీపీ నేతలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకుని రాజ్యాంగాన్ని సంరక్షించాలని కోరారు.