ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు షాక్.. జరిమానా విధింపు!
- తమ తీర్పును అమలు చేయలేదని హైకోర్టు ఆగ్రహం
- రూ. 1000 జరిమానా విధించిన హైకోర్టు
- ఈరోజు కోర్టు సమయం పూర్తయ్యేంత వరకు కోర్టులోనే ఉండాలని ఆదేశం
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో తమ తీర్పును అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు... ఇది తమను ధిక్కరించడమేనని ఈనెల 17న తెలిపింది. 31న తమ ముందు హాజరు కావాలని ఆయనకు ఆదేశాలను జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ఆయన కోర్టుకు హాజరయ్యారు.
కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఈరోజు కోర్టు సమయం ముగిసేంత వరకు ఇక్కడే కూర్చోవాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించింది. జరిమానా చెల్లించకపోతే వారం రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది.