Justice Aroop Goswami: ఏపీ హైకోర్టు సీజేగా అరూప్ గోస్వామి.. ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి

  • జస్టిస్ అరూప్ గోస్వామి అసోంకు చెందిన వారు
  • 1985లో న్యాయశాస్త్ర పట్టా పొందిన జస్టిస్ గోస్వామి
  • 2019లో సిక్కిం హైకోర్టు సీజేగా ప్రమోషన్
Aroop Goswami is the next CJ of AP High Court

ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి నియమితులయ్యారు. ఆయన నియామకానికి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ గా వెళ్లనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఈరోజు గెజిట్ ను విడుదల చేసింది. ఇందులో ఏపీ హైకోర్టు, సిక్కిం హైకోర్టు అధికారులకు జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలను కూడా పొందుపరిచారు.

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతను స్వీకరించనున్న అరూప్ గోస్వామి అసోంకు చెందిన వారు. 1961లో అసోంలోని జోర్హాట్ లో ఆయన జన్మించారు. 1985 లో ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. తన సర్వీసులో క్రిమినల్, సివిల్, ఉద్యోగ సేవలు, రాజ్యాంగాలకు సంబంధించిన పలు కేసులను వాదించారు. 2011లో గౌహతి హైకోర్టులో అడిషనల్ జడ్జిగా, 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 అక్టోబరు 15న సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఇప్పుడు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలను స్వీకరించబోతున్నారు.

More Telugu News