Deepika Padukone: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Deepika says she faced many hurdles in Bollywood in her beginning days
  • తనపై కామెంట్స్ చేసేవారంటున్న కథానాయిక 
  • హాకీ ఆటగాడిగా మారుతున్న నాగ చైతన్య
  • దర్శక నిర్మాతలకు షాక్ ఇచ్చిన దిశా పఠానీ    
*  కెరీర్ ప్రారంభించిన మొదట్లో బాలీవుడ్ లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని చెబుతోంది కథానాయిక దీపిక పదుకొణే. తనకు నటించడం రాదంటూ చాలామంది గేలిచేసేవారనీ, అసలు నటనకు పనికిరానంటూ కామెంట్స్ చేసేవారని వాపోయింది. అయితే, వాటిని ఛాలెంజ్ గా తీసుకుని తానేమిటో నిరూపించానని దీపిక చెప్పింది.  
*  'మనం' ఫేమ్ విక్రంకుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా 'థ్యాంక్యూ'  పేరిట ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చైతూ హాకీ ఆటగాడిగా నటిస్తున్నాడట. దీంతో ఆ క్రీడలో చైతూ కాస్త తర్ఫీదు కూడా పొందినట్టు తెలుస్తోంది.
*  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రంలో స్పెషల్ సాంగును బాలీవుడ్ భామ దిశా పఠానీ చేత చేయించాలని నిర్మాతలు ఆలోచిస్తున్న విషయం విదితమే. అయితే, ఒక్క పాట చేయడానికి ఈ చిన్నది 1.5 కోట్లు అడిగినట్టు, దాంతో దర్శక నిర్మాతలు షాక్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.
Deepika Padukone
Naga Chaitanya
Vikram Kumar
Disha Pathani

More Telugu News