KCR: ముదోల్ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయండి: కేసీఆర్

  • 6 వేల ఎకరాలకు సాగునీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తి చేయండి
  • 10 కిలోమీటర్ల పొడవు సీసీ కెనాల్ ను సత్వరమే పూర్తి చేయాలి
  • అర్లి వంతెన పునర్నిర్మాణ పనులను చేపట్టాలి
KCR orders to finish all development activities in Mudole constituency

ముదోల్ నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులను సత్వరమే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి పలు అంశాలను ప్రస్తావించారు. వీటిపై సీఎం సానుకూలంగా స్పందించారు. 6 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూపొందించిన పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను చేపట్టాలని, గడ్డన్నవాగు ప్రాజెక్టు నిర్మాణంలో మిగిలిన 10 కిలోమీటర్ల పొడవు సీసీ కెనాల్ ను సత్వరమే పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

నియోజకవర్గం పరిధిలోని అర్లి వంతెన కూలిపోయే దశలో వున్నందున పునర్నిర్మాణ పనులను చేపట్టాలని, గుండెగావ్ గ్రామం ముంపుకు గురవుతున్నందున గ్రామ ప్రజలను ఆదుకునేందుకు నిర్వాసిత సహాయ కార్యక్రమాలను చేపట్టాలని కేసీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

More Telugu News