తమిళనాడులో రజనీ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్న అభిమానులు!

30-12-2020 Wed 10:14
  • రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటన
  • అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం
  • పలు ప్రాంతాల్లో ఫ్యాన్స్ నిరసన
Fans Angry Over Rajani Desission
తాను రాజకీయాల్లోకి రావడం లేదని, ప్రజలకు సేవ మాత్రం చేస్తూనే ఉంటానని సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్న చేసిన ప్రకటన ఆయన అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. నిన్న ఆయన నుంచి ప్రకటన వెలువడిన వెంటనే పలువురు ఫ్యాన్స్ పోయెస్ గార్డెన్ కు చేరుకుని, అక్కడ రోడ్డుపై కూర్చుని ధర్మా చేశారు. తిరుచ్చిలో అభిమానులు ఆగ్రహంతో తమ అభిమాన నేత దిష్టిబొమ్మను, అప్పటికే కట్టి ఉంచిన బ్యానర్లను దగ్ధం చేశారు. కన్యాకుమారి, మధురై, విల్లుపురం, కోయంబత్తూరు, వేలూరు తదితర ప్రాంతాల్లోనూ రజనీ అభిమానులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.