Britain: బ్రిటన్ విమానాలపై మరికొంత కాలంపాటు నిషేధం: కేంద్రం

India may extend ban on britain flights
  • భారత్‌లో వెలుగు చూస్తున్న కొత్త వైరస్
  • మరో ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం
  • వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి 42 లక్షల మంది భారతీయులు
కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో ఈ నెల 23 నుంచి 31 వరకు భారత్-బ్రిటన్ మధ్య విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసిన భారత ప్రభుత్వం దానిని మరికొంత కాలం పొడిగించాలని నిర్ణయించింది. దేశంలోనూ కొత్త వైరస్ జాడలు గుర్తించడంతో నిషేధాన్ని మరింత కాలం పొడిగించే అవకాశం ఉందని పౌర విమానయాన మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి నిన్న పేర్కొన్నారు. వైరస్‌ను కట్టడి చేయడంతోపాటు ఇరు దేశాల మధ్య విమాన సేవలకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.

వందే భారత్ మిషన్ ద్వారా 42 లక్షల మంది భారతీయులను విదేశాల నుంచి తీసుకొచ్చినట్టు మంత్రి చెప్పారు. వీరిలో కేరళకు చెందిన 8 లక్షల మంది ఉన్నట్టు తెలిపారు. తెలంగాణకు 1,84,632 మంది వచ్చినట్టు పేర్కొన్నారు. కరోనాకు ముందు 40 దేశాలకు రాకపోకలు సాగించిన ఎయిర్ ఇండియా కరోనా సమయంలో 75 దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్టు మంత్రి తెలిపారు.
Britain
corona new strain
India
flight services

More Telugu News