Disha Pathani: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Disha Pathani considered for a special song in Pushpa
  • 'పుష్ప' కోసం బాలీవుడ్ భామ స్పెషల్ సాంగ్ 
  • పల్నాడు ప్రాంతంలో బాలకృష్ణ షూటింగ్
  • రకుల్ తమ్ముడు అమన్ హీరోగా 'తెరవెనుక'
*  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ భామ దిశా పఠానీని సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ ముద్దుగుమ్మ భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తోందట. దాంతో ఆమె ఎంపిక ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది.
*  బాలకృష్ణ, బోయపాటి కలయికలో రూపొందుతున్న మూడో చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. త్వరలో గుంటూరు జిల్లా కోటప్పకొండ పరిసరాల్లో తదుపరి షెడ్యూలును నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం అక్కడ భారీ సెట్ ను కూడా వేస్తున్నట్టు సమాచారం. ఇందులో ప్రగ్య జైస్వాల్ కథానాయికగా నటిస్తోంది. 
*  కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ హీరోగా 'తెరవెనుక' అనే చిత్రం రూపొందింది. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జనవరి 1న విడుదల చేస్తున్నారు. మహిళలకు స్వీయ రక్షణ ముఖ్యమని చెప్పే కథాంశంతో దీనిని రూపొందించినట్టు దర్శకుడు తెలిపారు.
Disha Pathani
Allu Arjun
Balakrishna
Rakul Preet Singh

More Telugu News