Melbourne: మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో తెలుగు మాటలు... నెట్టింట సందడి చేస్తున్న వీడియో!

  • టీమిండియాలో తెలుగుతేజం
  • మిడిలార్డర్ లో ఆడుతున్న హనుమ విహారి
  • ఆసీస్ బ్యాటింగ్ సందర్భంగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్
  • త్వరగా అవుట్ చేయాలని కోరిన ప్రేక్షకుడు
  • అలాగైతే మ్యాచ్ అయిపోతుందన్న విహారి
  • తెలుగులో సాగిన సంభాషణ
Telugu words in Melbourne Cricket Ground

భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో రెండో టెస్టు ఇవాళ ముగిసింది. నాలుగోరోజే ఫలితం తేలిన ఈ మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. అయితే, ఇవాళ్టి ఆట సందర్భంగా మైదానంలో తెలుగు మాటలు వినిపించాయి. అదెలాగంటారా...! భారత జట్టులో ఆడుతున్న హనుమ విహారి తెలుగువాడన్న సంగతి తెలిసిందే. విహారి కాకినాడ కుర్రాడు. ఆసీస్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా విహారి బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు.

అయితే ప్రేక్షకుల్లో ఓ తెలుగు వ్యక్తి ఉండడంతో, విహారిని ఉద్దేశించి అతడు తెలుగులో మాట్లాడాడు. త్వరగా అవుట్ చేయండి అంటూ విహారిని కోరాడు. అందుకు విహారి బదులిస్తూ, త్వరగా అవుట్ చేస్తే మ్యాచ్ అయిపోతుంది కదా అని వ్యాఖ్యానించాడు. మ్యాచ్ మరికాసేపు సాగితే ప్రేక్షకులకు వినోదం లభిస్తుందన్న కోణంలో విహారి ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ తెలుగు టు తెలుగు సంభాషణ తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

More Telugu News