Bandi Sanjay: 12 శాతం ఉన్న ముస్లింలు బీహార్ లో మతం పేరుతో గెలిస్తే 80 శాతం ఉన్న హిందువులు తెలంగాణలో గెలవలేరా?: బండి సంజయ్

Bandi Sanjay calls every hindu tries to revive Sanatana Dharma
  • బర్దీపూర్ లో దత్త జయంతి వేడుకలు
  • సనాతన ధర్మంపై ప్రసంగించిన బండి సంజయ్
  • సనాతన ధర్మ రక్షణ హిందూ పాలనతోనే సాధ్యమని వెల్లడి
  • ప్రతి ఒక్క హిందువు శ్రమించాలని పిలుపు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడాలంటే హిందూ పాలనతోనే సాధ్యమని అన్నారు. సనాతన ధర్మాలను వ్యతిరేకించే నాయకుల పాలన మనకొద్దని పేర్కొన్నారు. తెలంగాణలోనూ హిందువుల పాలన రావాలంటూ ప్రతి ఒక్క హిందువు శ్రమించాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్, కమ్యూనిస్టు, టీఆర్ఎస్... ఇలా ఏ పార్టీలో తిరిగినా ఒక చేత పార్టీ జెండా, మరో చేత కాషాయ జెండా పట్టుకుని ధర్మాన్ని పునరుద్ధరించేందుకు కదిలి రావాలని స్పష్టం చేశారు. 12 శాతం ఉన్న ముస్లింలు బీహార్ లో మతం పేరుతో గెలిచినప్పుడు 80 శాతం ఉన్న హిందువులు తెలంగాణలో గెలవలేరా? అని వ్యాఖ్యానించారు.

సంగారెడ్డి జిల్లా బర్దీపూర్ గ్రామంలో ఉన్న శ్రీ దత్తగిరి ఆశ్రమంలో జరిగిన దత్త జయంతి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay
Hindu
Sanatana Dharma
Telangana
Bihar

More Telugu News