Akhil: అఖిల్ తదుపరి సినిమాలో కథానాయికగా ముంబై మోడల్

Mumbai Model opposite Akhil
  • అఖిల్ తాజా చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' 
  • సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తదుపరి సినిమా
  • కథానాయికగా మోడల్ సాక్షి వైద్య ఎంపిక  
అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్ అక్కినేనికి ఇంకా హిట్ పడలేదు. హీరోగా తెరంగేట్రం చేసిన తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నా సరైన హిట్ మాత్రం ఇంకా ఈ కుర్రాడికి రాలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తాను చేస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన హాట్ బ్యూటీ పూజ హెగ్డే నటిస్తోంది. ఇది విడుదలకు సిద్ధమవుతోంది.

ఇక, తను ఈ చిత్రం తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. 'సైరా' సినిమా తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి చేస్తున్న రొమాంటిక్ మూవీ ఇది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు చాలావరకు పూర్తయ్యాయి. ఇందులో అఖిల్ సరసన కథానాయిక పాత్రకు చాలామందిని పరిశీలించిన పిదప సాక్షి వైద్య అనే ముంబై మోడల్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఏకే ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతుంది.
Akhil
Sakshi Vaidya
Surendar Reddy
Pooja Hegde

More Telugu News