Kamal Haasan: రజనీ ప్రకటనపై నేను కూడా నిరాశ చెందాను: కమలహాసన్

Kamal Haasan says he is disappointed with Rajinikanths decision
  • రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించిన రజనీకాంత్
  • అన్నింటికన్నా రజనీ ఆరోగ్యమే ముఖ్యమన్న కమల్
  • ప్రచారం ముగిసిన తర్వాత రజనీని కలుస్తానని వ్యాఖ్య
రాజకీయాల్లోకి తాను రావడం లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై తమిళనాడులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పలువురు ప్రముఖులు ఈ ప్రకటనపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

రజనీకాంత్ మిత్రుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ కూడా తాజాగా స్పందిస్తూ, తన ఆవేదన వ్యక్తం చేశారు. అందరు అభిమానుల్లాగానే రజనీ ప్రకటించిన నిర్ణయం పట్ల తాను కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యానని చెప్పారు. అయితే, అన్నింటికన్నా రజనీ ఆరోగ్యమే తనకు ముఖ్యమని అన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత తాను రజనీని కలుస్తానని చెప్పారు.

మరోవైపు రజనీ ప్రకటన పట్ల అతని అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. కొన్ని చోట్ల రజనీ దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
Kamal Haasan
MNM
Rajinikanth
Kollywood
Tollywood

More Telugu News