ఏపీ కరోనా అప్ డేట్: గత 24 గంటల్లో 326 కొత్త కేసులు

29-12-2020 Tue 19:12
  • కృష్ణా జిల్లాలో 67 కొత్త కేసులు
  • విజయనగరం జిల్లాలో ఇద్దరికి పాజిటివ్
  • యాక్టివ్ కేసుల సంఖ్య 3,383
  • 24 గంటల్లో కరోనాతో ఇద్దరి మృతి 
AP Covid update

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అనంతపురం జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో మరొకరు మృతి చెందారు. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,100కి చేరింది. ఇక, తాజాగా 50,794 కరోనా పరీక్షలు నిర్వహించగా 326 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 67 కేసులు వెల్లడయ్యాయి. గుంటూరు జిల్లాలో 56, చిత్తూరు జిల్లాలో 52 కేసులు నమోదయ్యాయి.

అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 4, నెల్లూరు జిల్లాలో 6, శ్రీకాకుళం జిల్లాలో 6, ప్రకాశం జిల్లాలో 9 కేసులు గుర్తించారు. అదే సమయంలో 364 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,81,599 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,71,116 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,383 మందికి చికిత్స జరుగుతోంది.