Iceberg: జంతుజాలానికి ముప్పుగా మారిన అతిపెద్ద మంచు దిబ్బ ఏ68ఏ!

Iceberg moves towards British island South Georgia
  • 2017లో విడిపోయిన మంచుదిబ్బ
  • అంటార్కిటికా నుంచి సముద్రంలో పయనం
  • బ్రిటన్ అధీనంలోని సౌత్ జార్జియా ద్వీపం దిశగా వస్తున్న వైనం
  • సీళ్లు, పెంగ్విన్లకు నష్టం కలిగే అవకాశం 
మూడేళ్ల కిందట అంటార్కిటికా మంచు ఖండం నుంచి విడిపోయిన ఓ భారీ మంచు ఫలకం ఇప్పుడు జంతుజాలానికి ముప్పుగా మారిన వైనం ఆందోళన కలిగిస్తోంది. ఇది ప్రస్తుతం అట్లాంటిక్ మహాసముద్రంలో తేలుతూ బ్రిటన్ కు చెందిన సౌత్ జార్జియా ద్వీపం దిశగా పయనిస్తోంది. ఈ మంచు దిబ్బలో రెండు పగుళ్లను గుర్తించిన శాస్త్రవేత్తలు వాటికి ఏ68ఏ, ఏ68ఎఫ్ అని పేర్లు పెట్టారు. వీటిలో ఏ68ఏ కారణంగా సౌత్ జార్జియా ద్వీపంలోని జంతుజాలంపై తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.

ఈ మంచుదిబ్బ పరిమాణం 2,600 చదరపు కిలోమీటర్లు. సౌత్ జార్జియా ద్వీప తీరంలో ఎక్కువగా సీళ్లు, పెంగ్విన్లు వంటి జీవజాతులు మనుగడ సాగిస్తుంటాయి. ఇప్పుడీ మంచుదిబ్బ సౌత్ జార్జియా తీరాన్ని తాకి అక్కడే నిలిచిపోతే పెంగ్విన్లు, సీళ్లు ఆహారం కోసం సుదూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అవి ఆహారం దొరక్క చనిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ మంచు ఫలకాలతో మేలు కూడా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మంచుదిబ్బ గనుక లోతు తక్కువగా ఉన్న తీరప్రాంతంలో నిలిచిపోతే, దీనిపై ఉండే దుమ్ముధూళి కణాలు... సముద్ర ప్లాంక్టన్ (పాచి)లను ఎరువుగా మారుస్తాయి. అందుకోసం వాతావరణంలో పోగుపడిన కార్బన్ డయాక్సైడ్ ను ఉపయోగించుకుంటుంది. కాగా, ఈ అతిపెద్ద మంచుదిబ్బ త్వరలోనే పగుళ్ల కారణంగా విడిపోయే అవకాశముందంటున్నారు.
Iceberg
A68A
Antarctica
Atlantic Ocean
South Georgia
Britain

More Telugu News