Hansika: నా డైరీలో పెళ్లి అనే పదానికి తావు లేదు: హన్సిక

There is no place for marriage in my life says Hansika
  • మూడు పదుల వయసుకు చేరువైన హన్సిక
  • చెన్నై బిజినెస్ మేన్ ను పెళ్లాడబోతోందని ప్రచారం
  • ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న హన్సిక
వయసు మీద పడుతున్నా పెళ్లి చేసుకోకుండా ఉన్న హీరోయిన్ల జాబితా పెద్దగానే ఉంది. అనుష్క శెట్టి, త్రిష ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పేర్లే వస్తాయి. వీరంతా 30 ఏళ్లను దాటేశారు. హన్సిక (29), కీర్తి సురేశ్ (28) కూడా మూడు పదుల వయసుకు చేరువయ్యారు. వీరిద్దరి పెళ్లి గురించి చాలా వార్తలు వచ్చాయి. ఓ రాజకీయ నాయకునితో కీర్తి పెళ్లి నిశ్చయమైందని ఈ మధ్య ఓ వార్త వైరల్ అయింది. అయితే ఆ వార్తను ఆమె ఖండించింది. మరోవైపు హన్సిక పెళ్లి గురించి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.

చెన్నైకి చెందిన ఓ బిజినెస్ మేన్ తో హన్సిక రిలేషన్ లో ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లాడబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఆమె స్పందిస్తూ, అలాంటిదేమీ లేదని చెప్పింది. తన డైరీలో పెళ్లి అనే మాటకు తావు లేదని చెప్పింది. ప్రస్తుతం ఈమె 'నిషా' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.
Hansika
Tollywood
Marriage

More Telugu News