Corona Virus: కొత్త కరోనా పేషెంట్ల కోసం తెలంగాణలో 12 ప్రత్యేక వార్డులు

New variant 12 special wards for Covid positive people in Telangana
  • ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • ఐదు జిల్లాల్లోని 12 ఆస్పత్రుల్లో స్పెషల్ ఐసోలేషన్ వార్డులు
  • కరోనా అని తేలినా భయపడొద్దని అధికారుల సూచన
బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్లలో ఇప్పటికే చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వాళ్లకు సోకింది కొత్త రకం కరోనానా.. పాతదేనా అన్నది ఇంకా తేలలేదు. అయితే, ముందు జాగ్రత చర్యగా వాళ్ల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కొత్త కరోనా సోకిన వాళ్ల కోసం 12 ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది.

ఐదు జిల్లాల్లోని 12 ఆసుపత్రుల్లో ఈ ప్రత్యేక ఐసోలేషన్ వార్డులుంటాయని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు చెప్పారు. కొత్త రకం కరోనాకూ పాత పద్ధతిలోనే చికిత్స చేస్తామని, మార్పులు అవసరం లేదని వివరించారు. బ్రిటన్ నుంచి వచ్చి కరోనా సోకిన వాళ్లలో 85 శాతం మందిని ఇంట్లోనే క్వారైంటన్ చేశామన్నారు. అతి కొద్ది మందిని మాత్రమే ఆసుపత్రుల్లోని ఐసోలేషన్ కు తరలించామన్నారు. ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన వారిలో కొత్త కరోనా అన్న అనుమానం ఉన్న వారిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో ఉంచామన్నారు.

బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్లు కరోనా ఉన్నట్టు తేలినా భయపడాల్సిన అవసరం లేదని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. కొత్త కరోనా అని అనుమానం ఉంటే జాగ్రత్తగా ఉండాలన్నారు.
Corona Virus
COVID19
UK
Telangana

More Telugu News