Arun Alexander: తమిళ నటుడు అరుణ్ అలెగ్జాండర్ హఠాన్మరణం!

Tamil Actor Arun Alexander Died with Heart Attack
  • నిన్న గుండెపోటుతో మృతి
  • అరుణ్ వయసు 48 సంవత్సరాలు
  • దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కోలీవుడ్
ప్రముఖ తమిళనటుడు, ఎన్నో చిత్రాల్లో నటించిన అరుణ్ అలెగ్జాండర్ గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో కోలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన వయసు 48 సంవత్సరాలు. సోమవారం రాత్రి ఆయన ప్రాణాలు వదిలారు. 'బిగిల్', 'ఖైదీ', 'కొలమావు కోకిల' తదితర చిత్రాల్లో నటించిన ఆయన, ఆ చిత్రాల డబ్బింగ్ వర్షన్ల ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకూ సుపరిచితుడే.

ఆయన నటించిన చివరి చిత్రం 'మాస్టర్' కాగా, విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది. అరుణ్ మరణం కలచి వేసిందని వ్యాఖ్యానించిన దర్శకుడు కనగరాజ్, ఇంత త్వరగా వెళ్లిపోతాడని ఊహించలేదని, ఈ బాధ తీరనిదని, అరుణ్ ఎప్పటికీ తన గుండెల్లో ఉంటాడని అన్నారు.
Arun Alexander
Kolywood
Passes Away

More Telugu News