Telangana: యూకే నుంచి తెలంగాణకు 1,216 మంది.. జాడలేని 156 మంది!

  • ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి 1,216 మంది
  • 996 మందికి పరీక్షలు
  • 21 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ
  •  రాష్ట్రానికి వచ్చిన వారిలో 58 మంది ఇతర రాష్ట్రాల వారు
156 UK returnees missing

బ్రిటన్‌లో కొత్తరకం వైరస్ కలకలం సృష్టిస్తున్న వేళ, ఆ దేశం నుంచి తెలంగాణకు చేరుకున్న వారిలో 156 మంది ఆచూకీ లభ్యం కావడం లేదు. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు 1,216 మంది ప్రయాణికులు వచ్చారు. వీరిలో 156 మంది ఆచూకీ తెలియరాలేదు.

అలాగే, వచ్చిన వారిలో ఆరుగురు ఇతర దేశాలకు వెళ్లిపోగా, 58 మంది ఇతర రాష్ట్రాల వారు ఉండడంతో ఆయా రాష్ట్రాలకు ఆరోగ్య శాఖ సమాచారం అందించింది. అలాగే, ఇప్పటి వరకు 996 మందికి పరీక్షలు నిర్వహించారు. 21 మందికి  కరోనా సోకినట్టు రిపోర్టుల్లో వెల్లడైంది. దీంతో వీరి నమూనాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపగా, వరంగల్‌కు చెందిన వ్యక్తికి కరోనా కొత్త స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణ అయింది.

కరోనా పాజిటివ్‌గా తేలిన 21 మందిలో మల్కాజిగిరి జిల్లాకు చెందిన వారు 9 మంది, హైదరాబాద్‌కు చెందిన వారు నలుగురు, జగిత్యాలకు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. కరోనా కొత్త వైరస్‌ను నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసరావు తెలిపారు.

More Telugu News