Hyderabad: హిజ్రాలను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తికి శిక్ష.. బంజారాహిల్స్ పోలీసులకు హిజ్రాల సన్మానం

Transgenders Honor Banjara Hills Police
  • హిజ్రాలను వేధింపులకు గురిచేసిన కుర్మ వెంకట్ 
  • పోలీసులకు ఫిర్యాదు
  • పక్కా సాక్ష్యాలతో శిక్ష పడేలా చేసిన పోలీసులు
తమను వేధిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులను హిజ్రాలు సన్మానించారు. కుర్మ వెంకట్, అతడి ముఠా సభ్యులు హిజ్రాలను తరచూ వేధించేవారు. దీంతో వారు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి కుర్మ వెంకట్‌ను అరెస్ట్ చేశారు.

హిజ్రాలను వేధించినట్టు పక్కా సాక్ష్యాధారాలు సంపాదించిన పోలీసులు వాటిని కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన న్యాయస్థానం వెంకట్‌ను దోషిగా తేల్చి శిక్ష విధించింది. విషయం తెలిసిన హిజ్రాలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఏసీపీ, సీఐలను సత్కరించారు.
Hyderabad
Banjara Hills
Hijras
transgenders

More Telugu News