Santaclaus: క్రిస్మస్ విషాదం... కానుకలు పంచిన శాంటాకు కరోనా... 18 మంది మృతి

  • మోల్ నగరంలో ఘటన
  • క్రిస్మస్ సందర్భంగా వృద్ధులకు కానుకలు
  • శాంటా వేషం వేసిన డాక్టర్
  • డాక్టర్ కు కరోనా పాజిటివ్
Santa caused to death of old age people in Belgium

బెల్జియంలో క్రిస్మస్ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. యాంట్వెర్ప్ ప్రాంతంలోని మోల్ నగరంలో ఉన్న ఓ వృద్ధాశ్రమంలో శాంటాక్లాజ్ చేతి నుంచి బహుమతులు అందుకున్న వారిలో 18 మంది కరోనాతో మరణించారు. శాంటాకు కరోనా సోకగా, ఆ విషయం తెలియని అతగాడు వృద్ధాశ్రమంలో కానుకలు పంచాడు. మొత్తం 121 మంది వృద్ధులకు, 36 మంది సిబ్బందికి ఆ శాంటా కారణంగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంతకీ ఆ శాంటా వేషం వేసింది ఆ వృద్ధుల బాగోగులు చూసుకునే వైద్యుడేనట.

దీనిపై ఆ ఓల్డేజ్ హోం నిర్వాహకులు స్పందిస్తూ, కరోనా సోకిన విషయం ఆ డాక్టర్ కు తెలియదని వెల్లడించారు. శాంటా వేషంలో బహుమతులు పంచిన తర్వాత పరీక్ష చేయగా కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని తెలిపారు. మోల్ నగర మేయర విమ్ కేయర్స్ స్పందిస్తూ, వృద్ధులకు క్రిస్మస్ కానుకలు పంచే సమయంలో నిబంధనలు పాటించలేదని ఆరోపించారు.

More Telugu News