KRIDN: దేశంలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది!

  • కొత్త బైక్ తీసుకువచ్చిన వన్ ఎలక్ట్రిక్ స్టార్టప్
  • బైక్ పేరు క్రీడోన్ 
  • గంటకు 95 కిమీ వేగంతో పయనం
  • హైదరాబాదు, బెంగళూరులో డెలివరీ షురూ
  • త్వరలో తమిళనాడు, కేరళలో అమ్మకాలు
One Electric startup brings KRIDN bike

భారత్ లో కొంతకాలంగా స్టార్టప్ కంపెనీల హవా నడుస్తోంది. వన్ ఎలక్ట్రిక్ అనే అంకుర సంస్థ కూడా విద్యుత్ ఆధారిత బైక్ ల తయారీలో తనదైన ముద్ర వేస్తోంది. తాజాగా ఈ సంస్థ నుంచి 'క్రీడోన్' అనే ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటికే హైదరాబాదు, బెంగళూరు నగరాల్లో బైక్ డెలివరీలు ప్రారంభం అయ్యాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 2021 జనవరిలో అందుబాటులోకి రానున్నాయి. ఎలక్ట్రిక్ బైకుల్లో తమ క్రీడోన్ బైక్ అత్యంత వేగగామి అని 'వన్ ఎలక్ట్రిక్' చెబుతోంది. ఇది గంటకు 95 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుందని తెలిపింది. దీని ఎక్స్ షోరూం ధర రూ.1.29 లక్షలు. ఈ బైక్ పేరును ఆంగ్లంలో KRIDN అని సంస్థ పేర్కొంది. దీనికి సంస్కృతంలో 'ఆడుకోవడానికి' అనే అర్థం వస్తుందట.

More Telugu News