Adavi Sesh: సినీ హీరో అడివి శేష్ కు కోర్టు నోటీసులు

Actor Adavi Sesh gets notice from court
  • ఒక సినిమా నుంచి వైదొలగిన అడివి శేష్
  • కోర్టును ఆశ్రయించిన నిర్మాత
  • జనవరి 5లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించిన కోర్టు
టాలీవుడ్ లో ఒక విలక్షణమైన హీరోగా అడివి శేష్ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం 'మేజర్'. మరోవైపు ఆయన నటిస్తూ ఆగిపోయిన ఒక సినిమా ఇప్పుడు ఆయనకు కొత్త సమస్యలను తీసుకొస్తోంది. ఈ సినిమా విషయంలో ఆయనకు కోర్టు నుంచి ఆదేశాలు కూడా అందాయి.

వివరాల్లోకి వెళ్తే, అడివి శేష్ హీరోగా బాలీవుడ్ సినిమా 'టు స్టేట్స్ ను' తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నం జరిగింది. వెంకట్ కుంచ దర్శకత్వంలో ఎంఎల్వీ సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. అయితే కొన్ని తేడాలు రావడంతో సినిమా నుంచి అడివి శేష్ బయటకు వచ్చారు. దీంతో, నిర్మాత కోర్టును ఆశ్రయించారు. ఆయన బయటకు రావడం వల్ల తనకు నష్టం వాటిల్లిందని నిర్మాత కోర్టుకు తెలిపారు. జనవరి 5వ తేదీలోగా దీనిపై వివరణ ఇవ్వాలని అడివి శేష్ ను కోర్టు ఆదేశించింది.
Adavi Sesh
Tollywood
Court

More Telugu News