Roja: ఈ విషయం చెప్పగానే జగనన్న చాలా సంతోషించారు: రోజా

Jagan felt very happy after after seeing my video says Roja
  • ఇటీవల ఒక అమ్మాయిని దత్తత తీసుకున్న రోజా
  • ఆమె చదువు పూర్తయ్యేంత వరకు అండ 
  • దీనికి సంబంధించిన వీడియోను సీఎంకు చూపించానన్న రోజా
ఒక అమ్మాయిని వైసీపీ ఎమ్మెల్యే రోజా దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమె చదువు పూర్తయ్యేంత వరకు అన్ని ఖర్చులను తాను భరిస్తానని ఆమె తెలిపారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా చిన్నారిని ఆమె దత్తత తీసుకున్నారు. ఈ విషయం తెలిసి జగన్ చాలా సంతోషించారని తాజాగా రోజా తెలిపారు. తాను దత్తత తీసుకున్న చిన్నారి గురించిన వీడియోను చూపించి వివరించానని... ఆయన చాలా ఆనందించారని అన్నారు. తన అభిమాన నాయకుడి పేరు మీద చిన్నారిని చదివిస్తున్నందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.

పి.పుష్పకుమారి అనే చిన్నారి తన బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. అయితే డాక్టర్ కావాలనే ఆశతో ఆమె ఉంది. విషయం తెలుసుకున్న రోజా ఆమెను దత్తత తీసుకున్నారు. ఆమె కల నెరవేరేంత వరకు ఖర్చు మొత్తాన్ని తాను భరిస్తానని రోజా తెలిపారు. ఎంతోమంది చిన్నారులకు మేనమామలా మారిన జగన్ కు ఇదే తన పుట్టినరోజు బహుమతి అని చెప్పారు.
Roja
YSRCP
Jagan
Girl Adoption

More Telugu News