Puneeth Rajkumar: బాలకృష్ణ సినిమాలో కన్నడ స్టార్ హీరో గెస్ట్ రోల్?

Puneeth Rajkumars guest role in Balakrishnas movie
  • బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను చిత్రం  
  • భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా
  • గెస్ట్ పాత్రలో కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్  
  • పోలీసాఫీసర్ పాత్రలో కనిపించే పునీత్  
ఒక భాషకు చెందిన హీరోలు అప్పుడప్పుడు మరో భాషలోని హీరోల సినిమాలలో గెస్ట్ రోల్స్ చేయడం అన్నది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఆయా హీరోల మధ్య వుండే చక్కని రిలేషన్ కి అవి నిదర్శనంగా నిలుస్తుంటాయి. ఇప్పుడు కన్నడ చిత్రసీమలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న పునీత్ రాజ్ కుమార్ కూడా అలాగే ఓ తెలుగు సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. అది కూడా నందమూరి బాలకృష్ణ సినిమా కావడం ఇక్కడ విశేషం!

బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తాజాగా భారీ యాక్షన్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పునీత్ రాజ్ కుమార్ గెస్ట్ రోల్ చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడనీ, హీరోకి హెల్ప్ చేసే పాత్ర అదనీ అంటున్నారు. ఆయన క్యారెక్టర్ ఇంటర్వెల్ తర్వాత వస్తుందట. మొత్తానికి ఇదే కనుక నిజమైతే, కన్నడ నాట కూడా ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడుతుంది.
Puneeth Rajkumar
Balakrishna
Boyapati Sreenu

More Telugu News