Sensex: రిలీఫ్ ప్యాకేజీకి ట్రంప్ ఆమోదముద్ర.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 380 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 124 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3 శాతానికి పైగా లాభపడ్డ ఎస్బీఐ, టైటాన్
Sensex closes 380 points high

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను నమోదు చేశారు. కరోనాకు వ్యాక్సిన్ రాబోతోందనే అంచనాలతో పాటు, పాండమిక్ రిలీఫ్ ప్యాకేజీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోద ముద్ర వేయడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 380 పాయింట్లు లాభపడి 47,354కి పెరిగింది. నిఫ్టీ 124 పాయింట్లు పుంజుకుని 13,873కు చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.15%), టైటాన్ కంపెనీ (3.14%), ఎల్ అండ్ టీ (2.23%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.92%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.67%).

టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-0.41%), సన్ ఫార్మా (-0.39%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.18%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.07%).

More Telugu News