Jagan: చంద్రబాబు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో దీన్నిబట్టే తెలుస్తోంది: సీఎం జగన్

  • ఊరందూరులో పైలాన్ ఆవిష్కరించిన సీఎం
  • చంద్రబాబుపై ఆరోపణలు
  • ఇళ్ల పట్టాల పంపిణీపై కోర్టుకు వెళ్లారని వెల్లడి
  • స్టేలు తెచ్చి అడ్డుకుంటున్నారని విమర్శ 
CM Jagan fires on TDP Chief Chandrababu

ఏపీ సీఎం జగన్ ఇవాళ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరులో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ మాజీ సీఎం చంద్రబాబుపై ఆరోపణాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం ఇళ్ల లబ్దిదారులకు డీ పట్టాలు మాత్రమే కల్పిస్తున్నామని, న్యాయపరమైన అంశాల్లో సమస్యలు తొలగిపోగానే లబ్దిదారులకు అన్ని హక్కులు కల్పిస్తామని వెల్లడించారు.

చంద్రబాబు ముఠా కారణంగా రిజిస్ట్రేషన్ లు సాధ్యం కాలేదని సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. డిసెంబరు 25న ఇళ్ల పట్టాలు పంచుతామని తెలిసి ఒకరోజు ముందే డిసెంబరు 24న కోర్టుకు వెళ్లారని ఆరోపించారు. చంద్రబాబు ఎంత దుర్మార్గుడో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చని అన్నారు. పులివెందులలో ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా స్టే తెచ్చి అడ్డుపడ్డారని, అమరావతిలో 54 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం కాగా, సామాజిక సమతుల్యత అంటూ స్టే తెచ్చారని ఆరోపించారు. విశాఖలో లక్ష మందికి పైగా లబ్ది చేకూరుద్దామని భావిస్తే అక్కడా ఇలాగే వ్యవహరించారని వెల్లడించారు. న్యాయపరమైన చిక్కులు తొలగిపోగానే మిగిలిన వాళ్లకు కూడా ఇళ్ల పట్టాలు అందిస్తామని చెప్పారు.

More Telugu News