Junior NTR: 'ఆంధ్రప్రదేశ్ తదుపరి సీఎం జూనియర్ ఎన్ఠీఆర్' అంటూ ఫ్లెక్సీని పెట్టిన అభిమాని

Junior NTR flex in Prakasam Dist
  • ప్రకాశం జిల్లాలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన అభిమాని
  • ఫ్లెక్సీలో స్థానిక నేతల ఫొటోలు
  • ఎవరు ఏర్పాటు చేశారనే విషయంలో రాని క్లారిటీ
గతంలో తెలుగు దేశం పార్టీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే చాలా కాలంగా ఆయన రాజకీయాలకు అంటీముట్టనట్టు ఉన్నారు. గత ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారానికి రాలేదు. అయినప్పటికీ రాజకీయాలకు సంబంధించిన చర్చల్లో జూనియర్ ప్రస్తావన ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. టీడీపీ తెలంగాణ బాధ్యతలను తారక్ కు ఇవ్వాలనే డిమాండ్లు కూడా గతంలో వినిపించాయి. తారక్ అభిమానులందరూ ఆయన పొలిటికల్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు.

మరోవైపు తారక్ కు సంబంధించిన ఓ ఫ్లెక్సీ ప్రకాశం జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అంటూ ఎర్రగొండపాలెంలో ఒక అభిమాని ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. న్యూఇయర్ సందర్భంగా ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. ఈ ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు స్థానిక టీడీపీ నేతల ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ ఫ్లెక్సీపై ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే, ఈ ఫ్లెక్సీని ఎవరు ఏర్పాటు చేశారనే విషయంపై క్లారిటీ రాలేదు.
Junior NTR
Flex
CM
Telugudesam

More Telugu News